చెరువు – వినాయుకుడు
ఒకసారి ఒక ఊరినుండి ఆ ఊరి పెద్దమనుషులు మహాస్వామి వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చారు. వాళ్లఊరిలోని వినాయకుని విగ్రహం ఎవరో ఎత్తుకుని పోయారని కనుక ఒక కొత్త విగ్రహం కొసం మీదగ్గరకు వచ్చామని వారు మహాస్వామితో చెప్పారు.
మహాస్వామి వారు “మీ ఊళ్ళో చెరువు ఉందా?” అని అడిగారు.
“అవును ఉంది పెరియావ”
“అందులో నీళ్ళు ఉన్నాయా?”
వచ్చిన వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని “గ్రామ పంచాయితి శుభ్రం చెయ్యనందున కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి.”
“చెరువు లో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకూ పశువులకూ ఉపయోగమే కదా?” ”అవును పెరియావ”
“సరే ముందు మీరు మీ చెరువును పూడిక తీసి బగా నీరు నిలువ ఉండేటట్టు చెయ్యండి.” అని చెప్పి ఇక వారు వెళ్ళవచ్చు అన్నాట్టుగా వారికి ప్రసాదమును ఇచ్చి పంపించారు. వచ్చినవారు చాలా నిరాశపడి అది దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది. కాని మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమి మాట్లాదలేదు అని అనుకున్నారు. చెరువు పూడిక తీయటం పభుత్వ చేయవలసిన పని అది మేమెందుకు చేయాలి అని అనుకున్నారు. కాని కొంతమంది పెద్దలు మహాస్వామి “మహాస్వామి వారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం చేయవలసిందే. వారి మాటలను నిరాకరించి లేని పోని బాధలను ఎందుకు తెచ్చుకోవటం.“ అని అన్నారు. మనము ఏమి చేయలేము. ఇదంతా మనము చేసుకున్నదే. దీన్ని వాయిదా వెయ్యాటంకంటే ఇప్పుడే చేయవలసినదే అని తీర్మానించుకున్నారు.
ఒక రోజు ఊళ్ళో ఉన్న బలాఢ్యులు అందరూ కలిసి పలుగు పార పట్టుకుని చెరువు పూడిక పని ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత ఒకడు భూమిని కొట్టగా “టంగ్” మన్న శబ్ధం వినిపించింది. అతడు ఇక్కడ ఏదో ఉన్నదని అందరిని పిలిచాడు. వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం (ఎవరో ఎత్తుకెళ్ళినది కాదు). మరి కొద్దిసేపటి తరువాత మళ్ళా “టంగ్” మన్న శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం. తరువాత ఒక్కొక్కటిగా నంది, పార్వతి, దుర్గా, కార్తికేయుడు, బలిపీఠం మొత్తంగా శివ పరివారమే లభించింది. అందరూ వెంటనే కాంచిపురానికి బయలుదేరారు. ”మేము మహాస్వామిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము. కాని మాకు ఇప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది. వారి ఆనందానికి అవధులు లేవు.”
“చెరువు ప్రక్కన ఒక కొట్టం వేసి, ఆ విగ్రాహాలను అక్కడ ఉంచి దీపారధన చేసి పళ్ళు పూలతో రోజూ పూజించండి“ అని మహాస్వామి వారు చెప్పారు.
“మరి దేవాలయం” అడిగారు ఊరి పెద్దలు. ”వినాయకుడు వచ్చాడు కదా? ఇంకేం అంతా ఆయనే చూసుకుంటాడు.” అన్నారు మహాస్వామి.
కామకోటి పీఠ భూషణం కామాక్షి నందనం
#KanchiParamacharyaVaibhavam #Paramacharya
August 19, 2026 2K 5