ఒక నాలుగు నెలల క్రితం ఆ మార్వాడీ వ్యక్తికి తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదు. అతను అనారోగ్యంతో మంచం పట్టాడు. వైద్యులేమో ఇక ఎన్నో రోజులు బతకడని తేల్చి చెప్పేశారు. “ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు, అంతా దేవుని చేతిలో ఉంది” అని చెప్పారు.
ఆ మార్వాడీ వ్యక్తి భార్య పూజగదిలోకి వెళ్లి మహాస్వామివారి పటం ముందు కూర్చుని చేతులు జోడించి, భారమైన హృదయంతో, “స్వామీ, మా ఆయనకు నయం కావాలి, ఆరోగ్యంగా తిరిగి రావాలి. అందుకు నేను మూడు సవర్ల మంగళసూత్రాన్ని సమర్పిస్తాను. అది ఎవరైనా పేద ఆడపిల్ల మెడలో అలంకరింపబడుతుంది. నాకు ఈ వారం ఇవ్వండి స్వామీ” అని వేడుకుంది.
ఆమె అదృష్టవశాత్తూ మరుసటి రోజే ఆమె భర్త ఆరోగ్యం బాగయ్యింది. ఆమె వేడుకోలును స్వామివారు మరుసటి రోజే తీర్చడంతో, అతని జబ్బు నయమై అందరూ ఆశ్చర్యపోయారు.
మొక్కు తీర్చుకోవడానికి వెంటనే కంచికి ప్రయాణమయ్యారు. మూడు సవర్ల మాంగల్యం కొని స్వామివారికి సమర్పించారు. అందుకే స్వామివారు ఆ బ్రాహ్మణ దంపతులను మఠంలోనే ఉండమని చెప్పారు.
స్వామివారి దయ, కరుణ, దూరదృష్టికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆపదలో ఆదుకునే ఆ ఆపద్బాంధవుణ్ణి చూసి అందరూ అశ్రునయనాలతో నమస్కరించారు. తాము సమర్పించిన మాంగల్యం సరైన సమయంలో అవసరం ఉన్న వాళ్లకే చెందడంతో ఆ మార్వాడీ కుటుంబం చాలా ఆనందంతో ఊరికి ప్రయాణమయ్యారు. సమయానికి తమ కుమార్తె వివాహానికి మంగళసూత్రం అందడంతో వారూ ఆనందంతో ఊరికి ప్రయాణమయ్యారు.
--- “మహా పెరియవా” సంకలనం నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
దీవ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం
కాంచీశ్వరీ రుచిర చిత్కళయా సుదీప్తం
దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
August 17, 2026 2.2K 4