ఇచ్చాపురం నియోజకవర్గం మండపల్లి పంచాయతీ మెహర్ గారు ( డిజిటల్ అసిస్టెంట్)మన మధ్య ఇక లేరనే విషాద వార్తను ఎంతో బాధతో తెలియజేస్తున్నాను.
నిన్న ఆధార్ క్యాంపులో విధులు నిర్వహించడంతో పాటు, సెన్సెస్‌లో పనిచేస్తున్న సిబ్బందికి శాలరీలు అందేలా బిల్లులు పెట్టే పనిలో కూడా ఆయన నిమగ్నమయ్యారు. విధుల్లో ఉండగానే అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈరోజు తుదిశ్వాస విడిచారు.
ఎన్నో ఉద్యోగ ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే, తన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించిన మెహర్ గారు ఈరోజు మనందరికీ దూరమవడం తీవ్ర విషాదకరం. ఆయన మరణం మనందరికీ తీరని లోటు.
ఆయన పవిత్ర ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని మరియు వారి యొక్క కుటుంబానికి దేవుడు ఓదార్పు దయచేయాలని దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

August 21, 2026 10K 4