*📡సందేహాలు - సమాధానాలు✍️* 1.ప్రశ్న: *ఒక ఉపాధ్యాయుడు 3 రోజులు సకల జనుల సమ్మె సంపాధిత సెలవు పెట్టారు. 4వ రోజు సిఎల్ పెట్టుకోవచ్చునా?* జవాబు: *పెట్టుకోరాదు. సకల జనుల సమ్మె సంపాదిత సెలవు నగదుగా మార్చుకొనుట మినహా, మామూలు సంపాదిత సెలవుగానే పరిగణించాలి. సంపాదిత సెలవు, సిఎల్ కు కలపరాదు.* 2.ప్రశ్న: *ఒక ఉపాధ్యాయుడు అనుమతితో వారం రోజులు విదేశాలకు వెళ్ళారు. సకల జనుల సమ్మె సంపాదిత సెలవు వాడుకోవచ్చా?* జవాబు: *సకల జనుల సమ్మె సంపాదిత సెలవును నగదుగా మార్చుకొనుట మినహా మాములు సంపాదిత సెలవుగానే వాడుకొనవచ్చును. కావున ఆయనకు సకల జనుల సమ్మె సంపాదిత సెలవు మంజూరు చేయవచ్చు.*
July 7, 2026 129