_*గౌరవ డీఈవో మహబూబాబాద్ జిల్లా వారి LIP నిర్వహణా సూచనలు:*_ - అన్ని జిల్లాల వారికి వర్తించే అంశాలు.. *విషయం:* Learning Improvement Programme (LIP) – 2026-27 – తరగతులు VI నుండి IX వరకు Baseline Test నిర్వహణ – సూచనలు. జిల్లాలోని అన్ని MEOలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ, స్థానిక సంస్థ, TGMS, TGREIS, KGBV మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు క్రింది సూచనలు జారీ చేయబడుచున్నవి. *_సూచనలు:_* 1. తరగతులు VI నుండి IX వరకు చదువుతున్న విద్యార్థులకు Learning Improvement Programme (LIP) Baseline Testను 07-07-2026 నుండి 11-07-2026 వరకు తప్పనిసరిగా భౌతిక (Offline) విధానంలో నిర్వహించాలి. 2. SCERT పంపిన ప్రశ్నాపత్రాలు మరియు మూల్యాంకన మార్గదర్శకాలను (Guidelines) మాత్రమే ఉపయోగించాలి. 3. పరీక్షను పారదర్శకంగా నిర్వహించి, ప్రతి విద్యార్థి నిజమైన అభ్యాస స్థాయిని గుర్తించే విధంగా నిర్వహించాలి. 4. పరీక్ష అనంతరం వెంటనే మూల్యాంకనం (Evaluation) పూర్తి చేసి విద్యార్థుల మార్కులను నమోదు చేయాలి. 5. ప్రతి విద్యార్థి ఫలితాలను 31-07-2026లోపు Telangana School Education Appలో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. 6. పరీక్ష ఫలితాల ఆధారంగా ప్రతి విద్యార్థిలో ఉన్న Learning Gapsను గుర్తించి, ఆయా విద్యార్థులకు ప్రత్యేక బోధన (Remedial Teaching) ప్రణాళిక రూపొందించాలి. 7. Baseline Test ఫలితాలను విద్యా సంవత్సరం చివర నిర్వహించే Endline Test ఫలితాలతో పోల్చి విద్యార్థుల అభ్యాస పురోగతిని విశ్లేషించాలి. 8. ప్రధానోపాధ్యాయులు పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం మరియు డేటా అప్లోడ్ ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి. 9. MEOలు తమ మండలంలోని అన్ని పాఠశాలల్లో పరీక్షలు నిర్దేశిత తేదీలలో పూర్తయ్యేలా పర్యవేక్షించి, ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. 10. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలలకు అవసరమైన మార్గదర్శకాలు అందించి పరీక్షల నిర్వహణను సమీక్షించాలి. 11. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల నిర్వహణ లేదా Appలో ఫలితాల అప్లోడ్ ఆలస్యం చేయరాదు. 12. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని 100% పరీక్షల నిర్వహణ మరియు 100% ఫలితాల అప్లోడ్ జరిగేలా అన్ని ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. *గమనిక:* ఈ Baseline Test యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల ప్రస్తుత అభ్యాస స్థాయిని అంచనా వేసి, వారికి అవసరమైన విద్యా సహాయాన్ని అందించడం. అందువల్ల పరీక్షలను అత్యంత బాధ్యతతో నిర్వహించి, నాణ్యమైన బోధనకు ప్రణాళిక రూపొందించాలి.
గౌరవ డీఈవో మహబూబాబాద్ జిల్లా వారి LIP నిర్వహణా సూచనలు:*_ - అన్ని… — SCHOOL AND EDUCATION — TG.ME
July 7, 2026 86