కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS)* *తెలంగాణ ప్రభుత్వం – ఉద్యోగుల… — SCHOOL AND EDUCATION — TG.ME

*💥కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS)* *తెలంగాణ ప్రభుత్వం – ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT)* *▶️పథకం వర్తించే వారు:* *➡️రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని రెగ్యులర్ ఉద్యోగులు* *➡️స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్ ఉద్యోగులు* *➡️సర్వీస్ పెన్షనర్లు* *➡️ఫ్యామిలీ పెన్షనర్లు* *➡️రీ-ఎంప్లాయిడ్ సర్వీస్ పెన్షనర్లు* *➡️అర్హత కలిగిన ఆధారిత కుటుంబ సభ్యులు* *💥ఆరోగ్య కార్డులు* *▶️కొత్త NEHS హెల్త్ కార్డులు డిజిటల్ విధానంలో రూపొందించబడతాయి. NEHS మొబైల్ యాప్ మరియు వెబ్ పోర్టల్ ద్వారా కార్డులు అందుబాటులో ఉంటాయి. కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగి/పెన్షనర్ గుర్తింపు సంఖ్య ఆధారంగా చికిత్స కొనసాగుతుంది. కేవలం కొత్త కార్డు రాలేదనే కారణంతో అర్హత ఉన్న వ్యక్తికి చికిత్స నిరాకరించరాదు* *💥అవుట్ పేషెంట్ చికిత్స* *▶️వెల్‌నెస్ సెంటర్ల ద్వారా నగదు రహిత OP చికిత్స, ప్రాథమిక పరీక్షలు మరియు మందులు అందించబడతాయి. సాధారణ వ్యాధులతో పాటు కంటి, దంత, ENT, పిల్లల వ్యాధులు, ఫిజియోథెరపీ, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు తదితర వ్యాధులకు చికిత్స ఉంటుంది* *💥అత్యవసర పరిస్థితుల్లో* *▶️అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు రిఫరల్ లేకుండానే సమీపంలోని ఎంపానెల్ చేసిన నెట్‌వర్క్ ఆసుపత్రిలో నేరుగా చేరవచ్చు. ఈ విషయాన్ని EHCTకు వెంటనే, ఏ పరిస్థితిలోనైనా 48 గంటలలోపు తెలియజేయాలి.* *💥ఇన్-పేషెంట్ చికిత్స* *▶️ఎంపానెల్ చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆమోదించబడిన వైద్య, శస్త్రచికిత్స మరియు డే-కేర్ చికిత్సలు నగదు రహితంగా అందించబడతాయి. CGHSలో అక్టోబర్ 2025లో నోటిఫై చేసిన ప్యాకేజీలు మరియు ప్యాకేజీ రేట్లను NEHS స్వీకరించింది* *💥ఆర్థిక పరిమితి* *▶️ప్రతి అనారోగ్య ఎపిసోడ్‌కు ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి ఆధారిత కుటుంబ సభ్యులకు రూ.3.00 లక్షలు వరకు అర్హత ఉంటుంది. అయితే చికిత్స ఖర్చు రూ.3 లక్షలు దాటినా నగదు రహిత చికిత్స కొనసాగుతుంది; ఆ కారణంగా నెట్‌వర్క్ ఆసుపత్రి చికిత్సను నిరాకరించరాదు* *💥ఉద్యోగి/పెన్షనర్ చందా* *➡️ఉద్యోగి: నెలకు పొందే Basic Payలో 1.5%* *💥సర్వీస్ పెన్షనర్/ఫ్యామిలీ పెన్షనర్: నెలకు పొందే Basic Pensionలో 1.5%* *▶️ఇద్దరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కరి చందా సరిపోతుంది* *💥ప్రభుత్వం చెల్లించే Matching Contribution* *▶️ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ప్రతి నెల వసూలు చేసే మొత్తం చందాకు సమాన మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం Matching Contributionగా అందిస్తుంది* *💥Wellness Centres* *▶️ప్రస్తుతం ఉన్న 12 Wellness Centres కొనసాగుతాయి. అదనంగా 25 కొత్త Wellness Centres ఏర్పాటు చేసి మొత్తం 37 Wellness Centres చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇవి తెలంగాణలోని 33 జిల్లాల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలి* *💥ఆసుపత్రుల ఎంపానెల్* *▶️ఆసుపత్రులను మౌలిక వసతులు, నిపుణులైన వైద్యులు, నర్సింగ్/పారామెడికల్ సిబ్బంది, పరికరాలు, డయాగ్నస్టిక్ సౌకర్యాలు, నాణ్యత ప్రమాణాలు మరియు రోగి భద్రత ఆధారంగా ఎంపానెల్ చేస్తారు. ఎంపానెల్ ఆసుపత్రుల జాబితా EHCT అధికారిక వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది* *💥ఫిర్యాదుల పరిష్కారం* *▶️Health Card, అర్హత, చికిత్స నిరాకరణ, అదనపు డబ్బు వసూలు, రూమ్ అర్హత, మందులు, పరీక్షలు, pre-authorisation, ఆసుపత్రి సమన్వయం మరియు చికిత్స నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేక Grievance Redressal Mechanism ఏర్పాటు చేయబడుతుంది. అత్యవసర చికిత్స నిరాకరణ లేదా అనధికారికంగా డబ్బు వసూలు చేసిన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి*

August 23, 2026 115