వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం!
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు/పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురాబడింది.
🔹 ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
🔹 పోలీస్, అగ్నిమాపక,మున్సిపల్, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతుల ప్రక్రియ నిర్వహించబడుతుంది
🔹 అనుమతి మంజూరైన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం పొందవచ్చు
🔹 ఈ సేవ పూర్తిగా ఉచితం
సురక్షితమైన, ప్రశాంతమైన మరియు క్రమబద్ధమైన వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నిర్వాహకులు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా దరఖాస్తు చేసుకొనగలరు
September 3, 2026 465 3