📢ఏపీ టెట్ ప్రాథమిక కీ పై అభ్యంతరాలకు 27వ వరకు గడువు
ఏపీ టెట్ జూన్-2026 పరీక్షల ప్రాథమిక కీ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి 16 వరకు 11 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షకు 2,18,254 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను బుధవారం రాత్రి నుంచి టెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్యాండిడేట్ లాగిన్ ద్వారా వాటిని పరిశీలించుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే 27 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని టెట్ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు.
12
4August 22, 2026 9.6K 4