📢 **నేటి APTEACHERS వార్తా ముఖ్యాంశాలు 29.08.2026**
🎯 **Todays Speciality**
మేజర్ ధ్యానచంద్ పుట్టిన రోజు సంధర్భంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు
🌎 **APTEACHERS అంతర్జాతీయ వార్తా ముఖ్యాంశాలు:**
▪️నాసా రూపొందిస్తున్న 'రోమన్ స్పేస్ టెలిస్కోప్' హబుల్ కంటే 100 రెట్లు ఎక్కువ అంతరిక్ష ప్రాంతాన్ని పరిశీలించగలదని నాసా ప్రకటించింది.
▪️జన్యు చికిత్సలు లేకుంటేనే చూపు కోల్పోయిన ఎలుకలలో కాంతిని గుర్తించే శక్తిని తిరిగితీసుకొచ్చే 'కాంతి-ఆధారిత డ్రగ్స్'ను శాస్త్రవేత్తలు రూపొందించారు.
▪️నేపాల్-టిబెట్ సరిహద్దులో గ్లేసియర్ కూలిపోవడంతో వచ్చిన ఫ్లాష్ వరదల్లో మృతుల సంఖ్య 579కి చేరుకుంది, వేలాది మంది గల్లంతు, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం
▪️చైనాలో భూకంపం- రిక్టర్‌స్కేల్‌పై 5.1 తీవ్రతతో నమోదు- నేపాల్‌లో మరో హెచ్చరిక జారీ
▪️అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పేరు మార్చే ఆర్డర్ జారీ చేశారు.
▪️ఐస్‌లాండ్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై 2026 ఆగస్టు 29న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు దేశం సిద్ధమవుతోంది.
▪️65 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణ సాధించేందుకు వెనిజులాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుందని ట్రంప్ చెప్పారు.
🇮🇳 **APTEACHERS జాతీయ వార్తా ముఖ్యాంశాలు**
▪️జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు కోరిన టాస్క్‌ఫోర్స్ కమిటీ.
▪️భారత సైన్యం కోసం అధునాతన డ్రోన్ క్యారియర్ 'వాహక్-6' ఆవిష్కరణ.
▪️దేశీయంగా చక్కెర నిల్వలు, ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్త కోటా విధానం రూపకల్పన.
▪️మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల సాధన కోసం మరోసారి ఉద్యమ కార్యాచరణ ప్రకటన.
▪️రైల్వే స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు ముమ్మరం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టిన భారతీయ రైల్వే.
▪️జియో ప్లాట్‌ఫామ్స్‌కు సెబీ $3.8 బిలియన్ IPOకి అనుమతి ఇచ్చింది, ఇది భారత్‌లో అతిపెద్దది కావచ్చు.
▪️భారత్ న్యూఢిల్లీలో 18వ BRICS సమ్మిట్‌ను సెప్టెంబర్ 12-13న నిర్వహించనుంది.
▪️మహారాష్ట్రలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఒక సంవత్సరంలోపు పని అవసరాలకు సరిపడా మరాఠీ నేర్చుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
▪️నేపాల్ మరియు ఉత్తర భారతదేశ సరిహద్దుల్లో సరికొత్త 'హిమాలయన్ పాంగోలిన్' జాతిని డిఎన్ఏ పరీక్షల ద్వారా సైంటిస్టులు ధృవీకరించారు
▪️సోనియా గాంధీ రాసిన 'Belonging' పుస్తక ప్రచురణ నిలిచిపోవడంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది.
▪️యుజిసి-నెట్ జూన్ 2026 తుది 'ఆన్సర్ కీ'లను విడుదల చేసిన ఎన్‌టిఏ
▪️నీట్ యూజీ రెండో విడత కౌన్సెలింగ్ లో అల్ ఇండియా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 3 నుండి 11 వరకు, స్టేట్ కౌన్సెలింగ్ 7 నుండి 11 వరకు జరుగును
🌅 **APTEACHERS రాష్ట్ర వార్తా ముఖ్యాంశాలు**
▪️బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.
▪️రైతులు ప్రభుత్వ పంట బీమా ప్రయోజనాలు పొందేందుకు ఈ-క్రోప్ నమోదును తప్పనిసరి చేసిన వ్యవసాయ శాఖ.
▪️నాగబాబు AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 2047 నాటికి 50% రాష్ట్రంలో పచ్చదనం విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యం పెట్టుకున్నారు
▪️అమరావతిలో భారతదేశపు తొలి ప్రత్యేక క్వాంటమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
▪️వెలిగొండ ప్రాజెక్టును ఆగస్టు 31న ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
▪️ప్రభుత్వ ఉద్యోగుల 29 పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతి ఆగస్టు 31 నుంచి దశలవారీ ఉద్యమాన్ని ప్రకటించింది.
▪️ప్రామాణిక్ ఇన్ఫో టెక్ రూపొందించిన ఏఐ ఆధారిత ప్రమాణ్ కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టమ్ ను సిఎం చంద్రబాబు ప్రారంబించారు
▪️EAPCET బైపీసీ స్ట్రీమ్ లో తొలి దశ కౌన్సెలింగ్ లో 93.67% సీట్లు భర్తీ అయ్యాయి
🏏**Sports News**
▪️గ్రాండ్ చెస్ టూర్‌లో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.
▪️నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో మరో మైలురాయిని సాధించాడు.
2August 29, 2026 1.5K 1