నేటి విద్యా వార్తలు
28.08.2026
🔹 రేపు అనగా శనివారం (29-9-26) నాడు జరిగే స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్ సమావేశాలలో తెలుగు మరియు స్కూల్ అసిస్టెంట్ పిఇ లకు మినహాయింపు ఇచ్చారు. వీరు క్లస్టర్ సమావేశాలకు హాజరు కానక్కరలేదు. పాఠశాలలో భాషా దినోత్సవాలు మరియు క్రీడా దినోత్సవాలు నిర్వహించాలి.
🔹రాష్ట్రవ్యాప్తంగా 5, 7, 9 తరగతుల విద్యార్థులకు SLAS పరీక్ష ఈరోజు నిర్వహించబడుతుంది. ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్ ల లో తెలుగు, ఇంగ్లీష్ మరియు లెక్కలు సబ్జెక్టులో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. ఏర్పాట్లు పూర్తి అయినవి. పరీక్ష పేపర్లు ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దు.
🔹 SLAS పరీక్ష నిర్వహణ నిమిత్తం ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు లేదా సి.ఆర్.ఎం.టిలు
ఇన్విజిలేటర్లుగా హాజరవుతారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇన్విజిలేషన్ కు వచ్చిన ఉపాధ్యాయులకు సహకరిస్తే సరిపోతుంది. పరీక్ష అదే పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించరాదు.
🔹కుటుంబ పింఛనుదారుల డేట్ అఫ్ బర్త్ విషయంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ సవరణ ఉత్తర్వులు జారీ చేసినారు. కుటుంబ ఫించనుదారుల డేట్ అఫ్ బర్త్ లేనప్పుడు డేట్ అఫ్ బర్త్ నమోదైన ఏదేని రెండు రుజువులతో సబ్ ట్రెజరీ ఆఫీసర్ కు దరఖాస్తు చేసుకుంటే కుటుంబ ఫిం చినదారుల డేట్ అఫ్ బర్త్ ను STO స్థాయిలోనే మార్పు చేయవచ్చు
1August 28, 2026 1.5K