నేటి APTEACHERS వార్తా ముఖ్యాంశాలు 28.08.2026 🌎 APTEACHERS… — APTEACHERS APEMPLOYEES — TG.ME

📢 నేటి APTEACHERS వార్తా ముఖ్యాంశాలు 28.08.2026

🌎 APTEACHERS అంతర్జాతీయ వార్తా ముఖ్యాంశాలు:
▪️రోదసిలో ఉపగ్రహాలు మరియు అంతరిక్ష వ్యర్థాల ఆధారంగాm జిపిఎస్ (GPS) అవసరం లేకుండా నావిగేట్ చేసే కొత్త వ్యవస్థను నాసా విజయవంతంగా పరీక్షించింది.
▪️నేపాల్–చైనా సరిహద్దు ఫ్లాష్‌ఫ్లడ్‌లలో 400కి పైగా మరణాలు,1500 పైగా మిస్సింగ్, 30కిపైగా దేశాలకు చెందినవారు గల్లంతైనట్లు సమాచారం
▪️మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో UNCCD COP17 సదస్సు 17–28 ఆగస్టు 2026 వరకు ఘనంగా కొనసాగుతోంది.
▪️అమెరికా అధ్యక్షుడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై యూరోపియన్ యూనియన్ నాయకులతో అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించారు.
▪️యూరప్ దేశాల్లో రికార్డు స్థాయి వేడిగాలుల తీవ్రతతో పలు ప్రాంతాల్లో విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
▪️వాషింగ్టన్ సిరియాపై ఆంక్షల జాబితా నుంచి తొలగించిన తరువాత, దశాబ్దానికి పైగా విరామం తర్వాత అక్కడ అంతర్జాతీయ కార్డు చెల్లింపులు జరిగాయని వీసా, మాస్టర్‌కార్డ్ తెలిపాయి.
▪️ప్రపంచవ్యాప్తంగా ఎడారి భూములను పునరుద్ధరించడానికి మరియు కరువును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ నాయకులు ఏకమవుతున్నారు.
▪️ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర రవాణా రక్షణ కోసం క్వాడ్ దేశాల సంయుక్త నావికా విన్యాసాలు మొదలయ్యాయి.
▪️అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.


🇮🇳 APTEACHERS జాతీయ వార్తా ముఖ్యాంశాలు
▪️ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కొత్త డిజిటల్ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
▪️ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన చేస్తారు.
▪️భారత్ సెప్టెంబర్ 12-13న న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది.
▪️నేపాల్ వరదల ప్రభావిత భారతీయులకు సాయంగా విదేశాంగ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
▪️గోవా కేబినెట్ మతమార్పిడి నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపింది; దీనిని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
▪️రైల్వే స్టేషన్లు, రైళ్లలో చెత్త వేస్తే జరిమానాను రూ.1,000కు పెంచినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.
▪️ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఛత్తీస్‌గఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్షను రద్దు చేసింది; 20 రోజుల్లో ఈ విశ్వవిద్యాలయంలో ఇది మూడోసారి.
▪️18 ఏళ్ల లోపు వారికి రోజుకు రెండు గంటల పాటే ఫేస్బుక్, ఇంస్టా వాడే విధంగా యాప్ లలో భారీ మార్పులు చేయనున్న మెటా
▪️ దేశవ్యాప్తంగా రక్షా బంధన్ పండుగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

🌅 APTEACHERS రాష్ట్ర వార్తా ముఖ్యాంశాలు
▪️29న బంగాళాఖాతం లో అల్పపీడనం, సెప్టెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం
▪️విద్యార్ధుల అభ్యాసనా సామర్ధ్యాలు గుర్తించేందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో స్లాస్ సర్వే పరీక్ష జరగనున్నది
▪️విశాఖపట్నం ఐటీ కారిడార్‌లో భారీ గ్లోబల్ టెక్ కంపెనీల పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
▪️అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల మౌలిక వసతుల కోసం సీఆర్డీఏ రూ.1,437 కోట్ల పనులకు ఆమోదం ఇచ్చింది.
▪️జూనియర్ డాక్టర్ లకు 10% స్టైఫండ్ పెంచడానికి ప్రభుత్వం సానుకూలం, అయితే జూడా లు కనీస పెంపు 13% గా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు
▪️ఏపీ విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టుల భర్తీకు ముగిసిన రాత పరీక్షలు.


🏏Sports News
▪️భారత్-శ్రీలంక క్రికెట్ సిరీస్ లో భాగంగా కొలంబోలో జరిగిన మ్యాచ్ డ్రా అయినప్పటికీ భారత్ సిరీస్ ను గెలుచుకుంది.
❤5
August 28, 2026 1.2K